Home Remedies to Reduce PCOS: పీసీఓఎస్‌ను తగ్గించే ఇంటిచిట్కాలు.....! 10 month ago

featured-image

ఈ మ‌ధ్య‌కాలంలో టీనేజ్ అమ్మాయిల నుంచి పెళ్లైన స్త్రీల వ‌ర‌కు అంద‌ర్ని బాధిస్తున్న స‌మ‌స్య‌ల్లో ముఖ్య‌మైన‌ది అండాశ‌యంలో నీటి బుడ‌గ‌ల స‌మ‌స్య. వైద్య ప‌రిభాష‌లో పీసీఓఎస్‌(పాలిసిస్టిక్ ఓవ‌రీ సిండ్రోమ్‌) మ‌హిళ‌ల పాలిట శాపంగా మారింది. ప్ర‌స్తుత జీవ‌న శైలి కార‌ణంగా మ‌న దేశంలో ప్ర‌తి న‌లుగురు మ‌హిళ‌ల్లో ఒక‌రు ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారిలో నెల‌స‌రి క్ర‌మం త‌ప్ప‌డం, సంతాన‌లేమి, ఊబ‌కాయం, చ‌ర్మం న‌ల్ల‌బ‌డ‌టం, మొటిమ‌లు వంటి స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతుంటారు. పీసీఓఎస్ ఉన్న మ‌హిళ‌లంద‌రికీ ఒకే ల‌క్ష‌ణాలు ఉండ‌వు. వారి వ‌య‌సు, శ‌రీర‌త‌త్వం ప్ర‌కారం ల‌క్ష‌ణాలు మారతాయి.


పీసీఓఎస్ ఉన్న మ‌హిళ‌ల్లో అసాధార‌ణ స్ధాయిలో ఆండ్రోజ‌న్స్ ఉత్ప‌త్త‌వుతుంటాయి. ఇవి అండాశ‌యాల‌పై చిన్న‌చిన్న సిస్టుల్లాగా క‌నిపిస్తుంటాయి. ఫ‌లితంగా హార్మోన్ల స్ధాయుల్లో హెచ్చుత‌గ్గులు ఏర్ప‌డుతుంటాయి. పీసీఓఎస్ లక్షణాల నుంచి ఉపశమనం పొందడానికి రెగ్యులర్ వ్యాయామం చేయడం చాలా అవసరం. హార్మోన్లను స‌మ‌తుల్యం చేయ‌డానికి, మీ మాన‌సిక స్ధితి మెరుగుప‌ర‌చ‌డానికి, శ‌రీరం యాక్టివ్‌గా ఉండాలంటే వారానికి ఐదు సార్లు గంట వ్యాయామం చేయాల‌ని నిపుణులు అంటున్నారు.


మీ శ‌రీరంలోని టాక్సిన్స్ తొల‌గించ‌డానికి ఫైబ‌ర్‌, ప్రొటీన్‌ అధికంగా ఉండే గుడ్లు, బాదంప‌ప్పులు, ఓట్స్‌, పాలు పాల‌ప‌దార్ధాలు చికెన్ వంటివి రోజువారి మెనూలో భాగం చేసుకోవాలి. అలాగే శీత‌ల పానీయాలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువ‌గా ఉండే బంగాళాదుంప‌లు, వైట్ బ్రెడ్ వంటి ప‌దార్ధాల‌కు దూరంగా ఉండాలి. హార్మోన్ల అస‌మ‌తుల్యానికి నిద్రలేమి, ఒత్తిడి కూడా ఒక కార‌ణం. మీకు ఒత్తిడి క‌లిగించే ఆలోచ‌న‌లు, ప‌నుల నుంచి దూరంగా ఉండండి. ఇలా చేస్తే మ‌న‌సు ప్ర‌శాంతంగా ఉండి హార్మోన్లు స‌రిగ్గా విడుద‌ల‌వుతాయి.


గ‌మ‌నికః పైన అందించిన ఆరోగ్య స‌మాచారం, సూచ‌న‌లు మీ అవ‌గాహ‌న కోసం మాత్ర‌మే చెప్పిన‌వి. ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి స‌మ‌స్య‌లు ఉన్నా ముందుగా డాక్ట‌ర్‌ని సంప్ర‌దించ‌డం ఉత్త‌మం.



ఇది చదవండి: నోటి దుర్వాసన పోవడానికి చిట్కాలు.!


Related News

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD